జులై 9న దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరగబోయే సమ్మెను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా నాయకుడు మాధవరం కర్ణ పిలుపునిచ్చారు. ఆదివారం జూపాడు బంగ్లా మండలంలోని పారుమంచాల గ్రామంలో తమ బృందంతో కలిసి పర్యటించారు. ఆయన మాట్లాడుతూ. రైతులు పండించిన పంటకు పార్లమెంటులో మద్దతు ధర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సంబంధిత కరపత్రాలు పంపిణీ చేశారు. సిద్దర్ల బషీరు శేఖరు తదితరులు పాల్గొన్నారు.