నందికొట్కూరు మండలంలో మంగళవారం జరిగిన సర్వసభ్య సమావేశం తూతూ మంత్రంగా గంటన్నరలో ముగియడంతో ప్రజా ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు తగిన వినతులు లేకుండానే అధికారుల పరిమిత సమాచారం విని వెళ్లిపోవాల్సి వచ్చింది. లోనుపై మామూళ్లు, బియ్యం పంపిణీ అవకతవకలు, పీఎం సూర్యగర్ దరఖాస్తులపై కొందరు ప్రశ్నించినా అధికారులు నిర్లిప్తంగా స్పందించినట్లు గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు తెలిపారు.