నందికొట్కూరు మండలంలోని దామగట్ల గ్రామానికి చెందిన వేల్పుల భాస్కరరావు గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న శాసనసభ్యులు గిత్త జయసూర్య ఆదివారం గ్రామానికి చేరుకొని భాస్కరరావు పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తిప్పారెడ్డి, మాధవరం రత్నం, జయపాల్, హుస్సేనయ్య, సంజన, బాల వెంకటస్వామి జమీల్ తదితరులు పాల్గొన్నారు.