నందికొట్కూరు: తాగునీటి సమస్యలపై ముందస్తు చర్యల దిశగా అడుగులు

57చూసినవారు
నందికొట్కూరు: తాగునీటి సమస్యలపై ముందస్తు చర్యల దిశగా అడుగులు
నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం లక్ష్మాపురం గ్రామంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టాలని బుధవారం డీఈ అంజలీదేవి, ఏఈ శివకుమార్ ఆదేశించారు. ముస్లిం, బుడగ జంగాల కాలనీల్లో పర్యటించి వేసవికుంటను పరిశీలించారు. నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుజాత, ఎంసీ మహబూబ్ బాషా, శ్రీరాములు, ఇంజనీరింగ్ సహాయకుడు విష్ణువర్ధన్ గౌడ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్