నందికొట్కూరు పట్టణంలో వెళ్లే పైప్ లైన్ పనులను వెంటనే నిలుపుదల చేయాలని బుధవారం జేఏసీ ఆధ్వర్యంలో పట్టణ బంద్ పాటించారు. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తూ విజయవంతం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుండి 56 కి.మీ. ఓర్వకల్లుకు రూ. 258 కోట్ల బడ్జెట్ తో పైపులైన్ వేయడం జరుగుతుందన్నారు.