ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా నందికొట్కూరు నియోజకవర్గ అధ్యక్షుడు, జనసేన సీనియర్ నాయకుడు వీరం నవీన్ రెడ్డికి "బెస్ట్ ఆర్గనైజర్" అవార్డు లభించింది. 22 సార్లు స్వయంగా రక్తదానం చేయడంతో పాటు మెగా అభిమానులతో రక్తదానం చేయించారు. అందుకుగాను కలెక్టర్ చేతుల మీదుగా శనివారం నంద్యాల రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో మెమెంటో, ప్రశంస పత్రం అందుకున్నారు.