జూలై మొదటి వారంలోనే సాగునీరు విడుదల చేస్తున్నామని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు. ఆదివారం జూపాడుబంగ్లా మండలంలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద కృష్ణమ్మకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే గిత్త జయసూర్యాలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 5వ గేటు నుంచి మొదటి 2000 క్యూసెక్కులు నీరు విడుదల చేయగా క్రమంగా 5000 క్యూసెక్కుల పెంచి హెడ్ రెగ్యులేటర్ నుంచి దిగువకు మీరు విడుదల చేస్తామని వివరించారు.