నందికొట్కూరు పరిధిలోని జాతీయ రహదారి బ్రాహ్మణ కొట్కూరు, దామగట్ల, బొల్లవరం, తంగడంచ బన్నూరు, పలు గ్రామాలకు సంబంధించిన రైతులు వారి పొలాలకు వెళ్లడానికి రాస్తాలు లేవని, పంట వేసుకోవడానికి, పంట రవాణాకు చాలా ఇబ్బంది అవుతుందని, ఎలాగైనా సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే జయసూర్యకు శుక్రవారం తెలపడం జరిగింది. జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, పిడి పద్మజ వారి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.