పగిడ్యాల మండలంలోని పాతకోట గ్రామంలో నిలిచిపోయిన డంపింగ్ యార్డ్ నిర్మించేందుకు ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఎం మండల కన్వీనర్ పక్కిర్ సాహెబ్ డిమాండ్ చేశారు. శుక్రవారం నాయకులు డి.బాబు మాట్లాడుతూ.. గత టిడిపి ప్రభుత్వంలో గ్రామంలోని తడి, పొడి చెత్తను సేకరించి, డంప్ యార్డులో సేంద్రియ ఎరువులకు ఉపయోగించే విధంగా డంప్ యార్డు నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం దాదాపు పది లక్షలు మంజూర అయిందని తెలిపారు.