పగిడ్యాల మండలంలో గీతా కులాల వారు మద్యం దుకాణం ఏర్పాటుకు ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆత్మకూరు ఎక్సైజ్ సీఐ కిషోర్ కుమార్ తెలిపారు. రూ.2 లక్షల నాన్ రీఫండబుల్ డీడీ చెల్లించాలని, లక్కీ డిప్ ద్వారా ఒకరిని ఎంపిక చేస్తామని చెప్పారు. ఆసక్తిగల వారు తమ కుల ధ్రువీకరణ పత్రంతోపాటు నిర్దేశించిన రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.