ప్రజాభివృద్ధికై ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలి : ఏఐటీయూసీ

82చూసినవారు
ప్రజాభివృద్ధికై ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలి : ఏఐటీయూసీ
ప్రజల ఆమోదంతో పూర్తి స్థాయి మెజార్టీతో గెలుపొందిన ప్రజా ప్రభుత్వం అభివృద్దే ధ్యేయంగా పనిచేసి ప్రజల మన్ననలను పొందాలని ఏఐటీయూసీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు రఘురామమూర్తి అన్నారు. నందికొట్కూరు పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వేతన జీవులు, చిరుద్యోగులు, కార్మికుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం మానుకొని, అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. గ్రామాల్లో పాఠశాలలో పనిచేస్తున్న వంట ఏజెన్సీ మహిళలు, చిరుద్యోగులనూ తొలగించి వారి స్థానంలో తమ రాజకీయ పలుకుబడి, ఆధిపత్యం అవలంబిస్తూ తమ వారిని నియమించు కొనేందుకు చర్యలు తీసుకోవాలని కుయుక్తులు పడుతుండడం సరికాదన్నారు. పనిచేస్తున్న వారిని తొలగించి కొత్తవారిని నియమించుకోవాలనుకోవడం సరికాదని, ఆ ప్రయత్నాలను విరమించుకోవాలన్నారు. జిల్లాలో పెట్రేగిపోతున్న గంజాయి, మట్కా, కల్తీ మద్యం, అక్రమ మైనింగ్, అధిక వడ్డీ వసూలు చేస్తున్న ప్రైవేటు వ్యాపారులు, తదితర వాటిపై ఉక్కు పాదం మోపి ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచి ప్రజల సంక్షేమం కోసం ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా తగు చర్యలు తీసుకోవాలని ప్రజా రంజక పాలనను అందించాలని విజ్ఞప్తి చేశారు. గెలిచిన ధీమాలో గ్రామాల్లో ఆధిపత్య ధోరణి విడనాడి సంక్షేమం అభివృద్ధి కొరకు పాటుపడాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్