గడివేములలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఎంసి సభ్యులకు, ప్రధానోపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఎంఈఓ మేరీ సునీత మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో ఎస్ఎంసి కమిటీలదే కీలకపాత్ర అని, ఎస్ఎంసి కమిటీలు పాఠశాల అభివృద్ధికి చేదోడు వాదోడుగా ఉంటూ ఉపాధ్యాయులతో సహకరించాలని ప్రతినెల పాఠశాలలో ఎస్ఎంసి కమిటీ సమావేశాలు నిర్వహించాలాన్నారు.