పాములపాడు మండల పరిధిలోని మద్దూరు గ్రామ పంచాయతీ మజార గ్రామమైన కృష్ణ నగర్ లో విద్యుత్ షాక్ తో కామేశ్వరరావు(45) అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు జొన్న పంటను కోసి హార్వెస్టర్ మిషన్ కు కరెంటు తీగలు తగిలి మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు ఎస్సై సురేష్ బాబు పేర్కొన్నారు.