నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడు బంగ్లా మండలంలోని పోతులపాడు గ్రామంలో శనివారం ఉదయం 'సూపరిపాలన తొలి అడుగు' కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జయసూర్య హాజరై, కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించనున్నారు. పార్టీకి చెందిన అన్ని స్థాయిల నాయకులు తప్పక హాజరవ్వాలని నిర్వాహకులు తెలిపారు.