నంద్యాల జిల్లా ఎర్రగుడూరు గ్రామంలో సుంకుల పరమేశ్వరి ఆలయంలో గుర్తుతెలియని దొంగలు గురువారం చోరీ చేశారు. తాళాలు పగలగొట్టి హుండిని ఎత్తుకెళ్లిన దుండగులు హుండీని పగలగొట్టి కాళీ హుండీని, అమ్మవారి చీరను సమీపంలోని రాళ్లగుట్టలలో వదిలి వెళ్లారు. దుండగులు హుండిలో సుమారు 25 వేల నుండి 30 వేల మధ్య ఉండచ్చని గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు, ఆలయ నిర్వహకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.