నంద్యాల టౌన్ పరిధి లో 30 పోలీస్ ఆక్ట్ లో ఉన్నది కావునా ఎటువంటి ర్యాలీలకి, ధర్నా లకి మరియు ఊరేగింపులకు అనుమతి లేదు అని నంద్యాల టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి సోమవారం తెలిపారు. పోలీస్ సిబ్బంది అందరూ శ్రీశైలం బందోబస్తు లోను మరియు ఇతర బందోబస్తులలోనూ ఉన్నందున ఎవరికీ అనుమతి ఇవ్వడము లేదు మరియు ఎవరైనా ర్యాలీలు ధర్నా లు మరియు ఊరేగింపులు చేయాల్సిన వారు ఖచ్చితముగా పోలీస్ ల ముందస్తు అనుమతి తీసుకోవాలని అన్నారు.