నంద్యాల టౌన్ 42 వార్డు లో నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఆదివారం పర్యటించారు. 42 వార్డులో విద్యుత్ స్తంభాలు సరిగ్గా లేవని, కాలువలు సరిగ్గా లేకపోవడంతో మురికి నీరు రోడ్లపై పారడంతో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని , మంచినీటి వసతికి వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు. ఫిరోజ్ వెంటనే స్పందించి మున్సిపల్ మరియు సచివాలయ అధికారులకు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.