నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లి కోటేష్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఏ3 డ్రాయింగ్ షీట్ పై మైక్రో పెన్నుతో ఎలాంటి గీతాలు లేకుండా 2600 అక్షరాలతో ఎన్టీఆర్ చిత్రాన్ని శనివారం వేశారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి అనే నినాదంతో ఈ చిత్రాన్ని గీసినట్లు తెలిపారు. ఎన్టీఆర్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చి సముచిత గౌరవం కల్పించాలని డిమాండ్ చేశారు.