ఎరుకులచెరువు వసతి గృహంలో ప్రవేశాలకు ఆహ్వానం

62చూసినవారు
ఎరుకులచెరువు వసతి గృహంలో ప్రవేశాలకు ఆహ్వానం
పత్తికొండ నియోజకవర్గంలోని కృష్ణగిరి మండలంలోని ఎరుకులచెరువు ఎస్సీ బాలుర వసతి గృహంలో 2025-26 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు. వసతి గృహంలో మొత్తం 100 సీట్లుండగా, ప్రస్తుతం 55 మంది విద్యార్థులు ఉన్నారు. మిగిలిన 45 సీట్లు ఎస్సీ విద్యార్థులతో భర్తీ చేయనున్నట్టు ఇన్‌చార్జి వార్డెన్ వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు హాస్టల్లో లభ్యమవుతాయన్నారు.

సంబంధిత పోస్ట్