ఆవును ఢీకొన్న గుర్తు తెలియని వాహనం

66చూసినవారు
ఆవును ఢీకొన్న గుర్తు తెలియని వాహనం
నంద్యాల పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ లో గురువరాం గుర్తు తెలియని వాహనం ఆవు పాదాలపై నుంచి వెళ్ళింది. దీంతో నొప్పితో ఆవు గిలగిలలాడింది. రోడ్డుపై వెళుతున్న కొందరు ఆవుకు సపర్యలు చేశారు. గోమాత సంరక్షణ సభ్యులకు సమాచారం అందించగా వారు వచ్చి ఆవుకు ప్రథమ చికిత్స చేశారు. తదనంతరం ఆవును వాహనంలో పశువుల ఆసుపత్రికి తీసుకువెళ్లారు. రోడ్డుపై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని, ముఖ్యంగా పశువులను గుర్తించాలని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్