ఆత్మకూరు: నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు

66చూసినవారు
ఆత్మకూరు: నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు
నంద్యాల ఎక్సైజ్ సుపరింటెండెంట్ ఎస్. రవికుమార్ ఆదేశాల మేరకు మంగళవారం ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామంలో నాటు సారా తయారీదారులపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇద్దరు ముద్దాయులపై కేసు నమోదు చేసి, వారి వద్ద నుండి 10 లీటర్ల నాటు సారా, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని, ముగ్గురిపై బైండవర్ కేసులు కూడా నమోదు చేశారు. నాటు సారా తయారీ లేదా అమ్మకాల సమాచారాన్ని 14405, 9440902585, 8328307774, 9177299067 నెంబర్లకు తెలియజేయవచ్చని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్