నంద్యాల పట్టణంలోని ఫరూక్ నగర్ లోని ఉస్మానియా పాఠశాల నందు ఈ నెల 18వ తేది ఆదివారం ఉదయం 10. 30 గంటలకు నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఈ ఎన్నికల తరువాత జిల్లా వ్యాప్తంగా జేఏసీ విస్తరిస్తామని కన్వీనర్ అత్తవూల్లా ఖాన్ శుక్రవారం నంద్యాలలో పేర్కొన్నారు. కో కన్వీనర్ గన్ని కరీం మాట్లాడుతూ నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిజాయితీగా ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.