చెంచులు క్షయ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలి

57చూసినవారు
చెంచులు క్షయ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలి
మద్యం సేవిస్తూ సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల చెంచులకు టీబీ వ్యాధి త్వరగా సోకే ప్రమాదం ఉందని, వ్యాధిబారిన పడకుండా చెంచులు తగిన జాగ్రత్తలు పాటించాలని టీబీ సూపర్వైజర్ రవికుమార్ అన్నారు, గురువారం ఆత్మకూరు మండల పరిధిలోని పెచ్చెరువు చెంచు గూడెంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి చెంచులకు చికిత్సలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సిహెచ్ఓ మౌనిక, వైద్య సిబ్బంది చెంచులు తదితరులు పాల్గొన్నారు,

సంబంధిత పోస్ట్