నంద్యాల టిడిపి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గురువారం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నంద్యాల హెచ్. డి. ఎఫ్. సి బ్యాంక్ పరివర్తన్ వారోత్సవాల్లో భాగంగా మరియు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నంద్యాల టీడీపీ కార్యాలయం నందు ఎన్ఎండి ఫిరోజ్ యువసేన ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారన్నారు.