నంద్యాల: పేద ప్రజల సంక్షేమం కోసమే సీయం సహాయ నిధి

71చూసినవారు
పేద ప్రజల సంక్షేమం కొరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో తోడ్పడుతుందని నంద్యాల ఎంపీ డా. బైరెడ్డి శబరి అన్నారు. బుధవారం ఎంపీ నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధితులకు అందజేశారు. ఈ సందర్బంగా ఎంపీ డా. బైరెడ్డి శబరి మాట్లాడుతూ, చాలామంది నిరుపేదలు ఆసుపత్రుల పాలై ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగ పడుతుందని తెలిపారు. బాధితులకు చెక్కులు అందించామని ఎంపీ అన్నారు.

సంబంధిత పోస్ట్