నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం బుధవారం రసాభాసాగా జరిగింది. నంద్యాల మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా అధ్యక్షతన కమిషనర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు కూటమి ప్రభుత్వం ఇంతవరకు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.