నంద్యాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం బండి ఆత్మకూరు మండలం సంతజూటూరు ప్రాథమిక పాఠశాలకు పుస్తకాలను వితరణ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మోహన్ రెడ్డి మాట్లాడుతూ రూ.10వేల విలువైన పుస్తకాలను అందించడం సంతోషకరంగా ఉందని తెలిపారు. విద్యా, వైద్యానికి రోటరీ ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని కార్యదర్శి బాలకృష్ణ తెలిపారు. 2024 లో రోటరీ నుంచి అత్యధిక సేవా కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు.