ఆంధ్ర చెస్ అసోసియేషన్ నిర్వహించబోయే రాష్ట్రస్థాయి చెస్ పోటీలలో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక కోసం నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 19న నంద్యాల పట్టణంలో 7, 9 సంవత్సరాల్లోపు బాల బాలికలకు వేరువేరు విభాగాల్లో చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు రవికృష్ణ కార్యదర్శి రామసుబ్బారెడ్డి లు తెలిపారు. ఈనెల 18వ తేదీ లోపల apchess. org అనే వెబ్ సైట్ నందు పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.