నంద్యాల పట్టణంలో వైయస్ నగర్ కాలనీ ఏర్పడి 20 సంవత్సరాలు అవుతుందని, ఇళ్ల పట్టాలు అయితే ఇచ్చారు కానీ, ఏ ప్రభుత్వం కూడా మాకు మౌలిక సౌకర్యాలు చూపించలేదని స్థానికులు తెలిపారు. టిడిపి ఎమ్మెల్యే ఎన్ఎండి ఫరూక్, ఫిరోజ్ సహకారంతో మురుగు నీటి వ్యవస్థ కోసం డ్రైనేజీ కాలువలు, సైడ్ కాలువలను నిర్మించడం సంతోషకరమన్నారు. వార్డు ఇన్చార్జి దేరెడ్డి శివనాగిరెడ్డి పర్యవేక్షణలో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని కాలనీ ప్రజలు తెలిపారు.