నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాలమేరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు సిబ్బందికి ప్రస్తుత సమాజంలో పోలీసులు ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశంపై సైబర్ క్రైమ్ నేరాలు నియంత్రణలో యువత పాత్ర అనే అంశాలపై నంద్యాల అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు ఆధ్వర్యంలో వ్యాస రచన, వక్తృత్వ పోటీలు శుక్రవారం నిర్వహించారు. పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.