జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా నంద్యాల రోడ్డు రవాణా సంస్థ నంద్యాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రెడ్డి గురువారం పాల్గొన్నారు. డ్రైవర్లు సిబ్బందితో ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని, మీరు చేసే ఒక చిన్న పొరపాటు వలన ప్రమాదం జరిగి మీరు కుటుంబం ప్రమాదంలో పడటమే కాకుండా ఇతరులు కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందన్నారు.