వరదల్లో నష్టపోయిన ప్రజలను రైతులను ఆదుకోవాలి

55చూసినవారు
వరదల్లో నష్టపోయిన ప్రజలను రైతులను ఆదుకోవాలి
గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి నీరు చేరి నష్టపోయిన ప్రజలను, పంట పొలాలు మునిగిపోయి బాధపడుతున్న, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే ప్రభాకర్ రెడ్డి బుధవారం డిమాండ్ చేశారు. నంద్యాల సిపిఎం జిల్లా కార్యాలయం నందు జిల్లా విస్తృత సమావేశం నిర్వహించారు. పంటలు వేసుకుని నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్