తొలి ఏకాదశిని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలోని పలు ఆలయాల్లో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైష్ణవ దేవాలయాల్లో పంచామృత అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు చేశారు. భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం, నామసంకీర్తనలు చేశారు. పలుచోట్ల స్వామివారి కల్యాణోత్సవాలు కూడా చేపట్టారు.