మునగాల గ్రామ మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి ఎన్టీఆర్ అవార్డు పొందిన నంద్యాల జిల్లా తొలి వ్యక్తి అని రోటరీ సభ్యులు తెలిపారు. రోటరీ భవనంలో అధ్యక్షుడు మోహనరెడ్డి, కార్యదర్శి బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన సేవా కార్యక్రమాల్లో ఏడు పదుల వయసులోనూ ముందుండటం ప్రశంసించారు. రోటరీ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.