ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ని నంద్యాల టిడిపి కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా గోస్పాడు ఎస్సై వెంకటప్రసాద్ కలిసి పుష్పగుంచం గురువారం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ గోస్పాడు లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.