నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ రచయిత్రి డా. కొండూరి శ్రీదేవి రచించిన 60వ పుస్తకం స్వప్నవాసవదత్త పుస్తకావిష్కరణ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. సూరన సారస్వత సంఘం, మాతృభాషాపరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు వచనా, రచనా, ప్రక్రియకు సమగ్రత సమకూర్చే రచనలతో డా. శ్రీదేవి నంద్యాల ఖ్యాతిని ఇనుమడింపజేసిందని వక్తలు తెలిపారు.ఈ సందర్భంగా రచయిత్రిని డా. శ్రీదేవి ని ఘనంగా సత్కరించారు.