నంద్యాల పట్టణంలోని నిరుపేద రజక కుటుంబాలకు ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం వెంటనే ఇంటి స్థలాలను మంజూరు చేయాలనిఏపి రజక ఎస్సీ సాధన చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నందవరం శ్రీనివాసులు రజక మంగళవారండిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలోని గుడిపాటిగడ్డ ప్రాంతాలలో నివసిస్తున్న రజకులు ఐకమత్యంతో చిన్నచెరువు కట్టవద్ధ వర్షాలు బాగా కురుసి పంటలు బాగ పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని గంగమ్మ జాతర నిర్వహించారు.