నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామంలో సర్పంచ్ రమణమ్మ ఆధ్వర్యంలో బుధవారం గ్రామసభను నిర్వహించారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ మంజూష, వీఆర్ఓ పద్మావతి, డిజిటల్ అసిస్టెంట్ సతీష్ కేదార్ నాథ్ బదిలీపై వెళ్తుండటంతో గ్రామస్తులు వారిని ఘనంగా సన్మానించారు. గ్రామ పెద్ద వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ఐదేళ్ల పాటు గ్రామానికి విశేష సేవలు అందించారని తెలిపారు.