పుణ్యక్షేత్రంలో ఐఏఎస్ అధికారి పూజలు

58చూసినవారు
నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో శనివారం తమిళనాడుకు చెందిన ఐఏఎస్ అధికారి మణికంఠన్ దంపతులు (నంద్యాల జిల్లా పార్లమెంట్ ఎన్నికల ఎక్స్ పెండేచర్ అధికారి)పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన పూజలు నిర్వహించుకున్నారు. వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్