విద్యార్థులు కష్టపడి చదివి కళాశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకరావాలని న్యూక్లియర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మురళీధర్ రెడ్డి బుధవారం అన్నారు. నంద్యాల పద్మావతి నగర్ నందు గల న్యూక్లియర్ జూనియర్ కళాశాల వార్షిక దినోత్సవాన్ని ఆర్కే ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం మురళీధర్ రెడ్డి మరియు డైరెక్టర్ వాసుదేవ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.