నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 21న జాబ్ మేళా

71చూసినవారు
నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 21న జాబ్ మేళా
నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఈనెల 21న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు శనివారం కళాశాల ప్రిన్సిపల్ శశికళ తెలిపారు. ఈ జాబ్ మేళాలో నాలుగు కంపెనీల ప్రతినిధులు వస్తున్నారని, ఎస్ ఎస్ సి, ఐటిఐ, డిప్లమా, డిగ్రీ మరియు బీటెక్ పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. హాజరయ్య అభ్యర్థులు విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డు, రెండు ఫోటోలతో హాజరుకావాలని కోరారు.

సంబంధిత పోస్ట్