గణిత ఉపాధ్యాయుడు, కవి మధుసూదన్ రచించిన కైరవి ఖండకావ్య పుస్తకావిష్కరణ సభ నంద్యాల పింగళి సూరన శాఖా గ్రంథాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. వచనకవిత్వం వైపు కవులు, రచయితలు మొగ్గుచూపుతున్న ప్రస్తుత సమయంలో సరళశైలిలో పద్యకృతిని అద్భుతమైన సందేశాలతో పాఠకలోకాన్ని అలరించారని కళారాధన ప్రధానకార్యదర్శి డాక్టర్ రవికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా కవులు, పాఠకులు, అతిథులు, తెలుగుతల్లి చిత్రపటానికి పూలమాలార్పణ చేశారు