ఎమ్ఎస్ఎమ్ఈ సర్వేను వేగవంతం చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటవ తేదీ నాటికి పూర్తి చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ఎంపిడిఓ లను ఆదేశించారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ నుండి ఎమ్ఎస్ఎమ్ఈ సర్వే, హౌసింగ్, ఉపాధి హామీ, పిజిఆర్ఎస్, రీసర్వే, తదితర అంశాలపై స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.