రాష్ట్రంలో న్యాయశాఖ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టి కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. శుక్రవారం అమరావతి వెలగపూడి సచివాలయంలోని న్యాయ, మైనారిటీ మంత్రిత్వ శాఖ పేషీలో న్యాయ శాఖ కార్యదర్శి ప్రతిభా దేవి, ముఖ్య అధికారులతో మంత్రి ఫరూక్ సమీక్ష నిర్వహించారు.