మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించాలి

63చూసినవారు
రాష్ట్రంలో గతంలో మాదిరిగానే మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించాలన్నారు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి. కూటమి ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన పాలసీని సవరణ చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర సమితి పిలుపు మేరకు.. నంద్యాల జిల్లా సమితి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ లో గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన బుధవారం చేపట్టరు. ఈ కార్యక్రమంలో షమీం బేగం, రజిత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్