నంద్యాల జిల్లా మహానంది సమీపంలోని అరటి తోటలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందాడు. నిప్పటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఎవరైనా నిప్పట్టించారా అనే కోణంలో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. సోమవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.