నెలలో మూడవ శనివారం నిర్వహించే స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం నంద్యాల ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ షాదికాన పక్కన ఉన్న ఫిల్టర్ బెడ్ పంప్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మన చుట్టూ ఉన్న పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. అధికారులు తదితరులు పాల్గొన్నారు.