నంద్యాలలోని హిందూ స్మశాన వాటికలో నవనిర్మాణ సమితి ఆధ్వర్యంలో బృందావనం ప్రాజెక్టును ప్రారంభించామని డాక్టర్ మధుసూదన్ రావు శుక్రవారం తెలిపారు. శివుని విగ్రహం ముందు రాశి వనం పేరుతో 12 రాశులకు, 12 మొక్కలను శాస్త్ర ప్రకారం ఎంచుకొని నాటామన్నారు. అందులో ఒక మొక్కను శివుని విగ్రహం ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ మొక్కలు నాటారు. 2 ఎకరాల్లో 3, 600మొక్కలను నాటుతామని తెలిపారు.