రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండీ ఫరూక్ 75వ జన్మదిన వేడుకలు గురువారం నంద్యాలలో ఘనంగా జరిగాయి. టీడీపీ అసెంబ్లీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఎంపీ బైరెడ్డి శబరి, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. అభిమానులు కేక్ కట్ చేసి ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. సేవా కార్యక్రమాలుగా ఆసుపత్రుల్లో అన్నదానం, పండ్లు, పాలు పంపిణీ చేశారు.