సీఎంను కలిసిన ఎమ్మెల్యే జయసూర్య

61చూసినవారు
సీఎంను కలిసిన ఎమ్మెల్యే జయసూర్య
కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఓర్వకల్లు విమానాశ్రయానికి విచ్చేసిన టిడిపి జాతీయ అధ్యక్షులు సీఎం నారా చంద్రబాబు నాయుడును నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి, నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్త జయసూర్య మంగళవారం ఓర్వకల్లులోని విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నంది కోట్కూరు నియోజకవర్గంలోని సమస్యలపై సీఎంకు వివరించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, మండల కన్వీనర్ పలుచారి మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్